Saturday 14 April 2012

గొడ్డు మాంసం.... కొన్ని ప్రశ్నలు, జవాబులు...

నువ్వు గొడ్డు మాంసం తింటావా?
ఇష్టంగా తింటా...ముఖ్యంగా బీఫ్ కబాబ్లు బాగా ఇష్టం

గొడ్డు మాంసం ban చెయ్యడాన్ని ఆమోదిస్తార?
లేదు నా ఇష్టం అలవాట్ల మీద వేరే వాళ్ళ పెత్తనాని సహించను

గొడ్డు మాంసం వళ్ళ దేశ లేక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు దేబ్బతిన్టై అని నమ్ముతావ?
లేదు కచ్చితంగా కాదు అసలు ban వల్లే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది

హిందూ మతస్తుల మనోభావాలు దేబ్బతిన్టై అని భావిస్తావా?
అసలు మనోభావాలు దేబ్బతిన్టై అనుకొంటే మనిషి బ్రతక లేడు. గుడ్డు తింటే ఒకరికి దెబ్బతినవచ్చు, గొడ్డు తింటే ఒకరికి  దెబ్బతినవచ్చు అసలు ఉల్లి తింటే ఇంకొకరికి దెబ్బతినవచ్చు....

ఉస్మానియా హాస్టలో గొడ్డు మాంసంని అనుమతించక పోవటం దళితులని వారి అలవాట్లని కించపరచటం కింద వస్తుందా?
ఒకవిధంగా అంతే అనుకోవాలి. శాంతి భద్రతలు సమస్యలు చూపించి అనుమతిన్చంక పోవటం సరికాదు. అప్పుడు సమస్య గొడవ చేసే వాళ్ళది వాళ్ళని కట్టడి చెయ్యటం పోయి ఏదో beef festival చేసుకొనే వళ్ళ మీద పడటం తప్పు.

అలాగే పంది మాంసం కూడా హాస్టల్ లో అనుమతించాల?
అవును పంది మాంసం కూడా అనుమతించాలి



  

Friday 13 April 2012

ప్రైవేటు బడులలో ఉచిత విద్య... ఎవడి సొమ్ము తో?

ప్రైవేటు బడులలో కూడా 25%  సీట్లని పేదవాళ్ళకి కేటాయించాలి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బాలలు చదువుకోవటం వారి ప్రాధమిక హక్కు అని ఉచిత విద్యనూ ఇవ్వలేననటం వారి నుండి ప్రాధమిక హక్కు లని దూరం చేయటమే అని కోర్టు తన తీర్పు పేర్కోనది. 

అయితే కోర్టు చదువు అన్నది ఊరికే దొరికే వస్తువు కాదని చదువు చెప్పటానికి కర్చు అవుతుందని ఆ కర్చు ఎవరు
 బరిస్తారో చెప్పకపోవటం విచారకరం. ఇప్పుడు ఈ ఉచిత భారాన్ని ఎవరు బరిస్తారు, ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా, ప్రభుత్వం  దాని లెక్కల ప్రకారమే ఇస్తుంది అంటే ఒక విద్యార్ధికి ఒక ప్రైవేటు బడిలో సంవత్సరానికి ఆరు వేలు కర్చు అవ్తోంది అనుకొంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక విద్యార్ధికి మహా అయితే ఏడాదికి మూడు వేలు వరుకు ఇస్తారు అంటే మిగిలిన మూడు వేలు ఆ స్కూలు ఫీజులు పెంచి వసూలు చెయ్యవలసిందే. పోనీ ప్రభుత్వం ఇచ్చే డబ్బు అయినా ఎక్కడ నుంచి వస్తోంది అది ప్రజల దగ్గర పన్నులు రూపంలో వసూలు చేసిందే అంటే ఎటు తిరిగి భారం ప్రజల పైనే.

ప్రస్తుతం ఎవరైతే వారి పిల్లలను ఫీజులు కట్టి ప్రైవేటు స్కూల్లో చదివిస్తునారో వారు కూడా ఇప్పుడు కట్టకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ప్రైవేటు బడులూ నకిలీ హాజరు పట్టికలు చూపించి ప్రభుత్వం ఇచే సొమ్ము ని దోచుకొంటై దానికోసం అధికారులకి ముడుపులు ముట్ట చెబుతాయి చివరికి ఇది మరో కుంబకోణం అవుతుంది ప్రజల నెత్తి మీద సంవత్సరానికి మరో ఏబై వేల కోట్ల భారం.

పిల్లలను బడి కి పంపాలి అంటే నిర్బంధ విద్య చట్టం తో పరిష్కారం రాదు...ప్రజలకు చదువుకుంటే వుండే లాబాలు తెలియాలి ప్రభుత్వమే ఉపాధి హామీ అని పని వున్నా లేక పొఇనా కూలి ఇచ్చి రెండు రుపైల కే కిలో బియం ఇస్తే చదువుకొని సంపదిన్చావలిసిన అవసరం ప్రజలకు ఏమిటి. చదువు హక్కు అని తిండి హక్కు అని ఇల్లు హక్కు అని బట్ట హక్కు అని అన్ని ఉచితంగా ఇవ్వటానికి ప్రభుత్వానికి డబ్బులు ఏమి చెట్టుకు కాయటంలా ప్రజల వద్ద నుంచే పన్నులు అనే పేరుతో దోపిడీ చేస్తోంటే వస్తునై ఈ దోపిడిని ప్రజలందరూ ముక్త కాంతం తో వ్యతిరేకించాలి.

ప్రజలకి ఎజమన్యాలకి వున్నదార్లు ఏమిటి. ప్రతి స్కూలు stateboard మరియు central board ల నుంచి తమ  గుర్తింపును
స్వచందంగా విరమించుకోవాలి ప్రైవేటుగా తమ సిలబస్ తామే తాయారు చేసుకోవాలి (ఇది ఇంకా మంచి సిలబస్ తాయారు చేయటానికి ఎంతో ఉపయోగం) ఈ స్కూలలని సిలబస్ని ratings ఇవ్వటానికి (credit ratings ఇచ్చే ICRA, CRISIL, Moodys & S&P లాగా) ప్రైవేటు సంస్థలని ఏర్పాటు చేసుకోవాలి వీటి ratings ఆధారంగా పై చదువులకు వెళ్లవచ్చు. ఇంత చేసిన ప్రభుత్వం తనకు వున్న అధికారం తో చట్టాన్ని అమలు చెయ్య వచ్చు కాని ఈ చట్టం తప్పు అని ప్రతి ఒక్కరు గ్రహించాలి అంతవరకు ఈ ప్రభుత్వం అనే గూండా చేతిలో మనం హింసించ బడుతునే వుంటాం.