Monday 7 May 2012

ప్రభుత్వం మాఫియా......ఒక విశ్లేషణ ...


మాఫియా చేసే అసలు నేరాలు  
  1. బలవంతపు వసూలు (హఫ్త):   మాఫియా చేసే ముక్య కార్యకలాపాలలో ఇది ఒకటి, అంటే జనాలని బెదిరించి డబ్బులు గుంజటం. ఇది నేరం అయితే ప్రభుత్వానికి మించి ఎవరు బలవంతపు వసూళ్ళకు పాలుపడరు కాకపోతే దానిని వారూ tax అంటారు.సరిగ్గా గమనిస్తే మాఫియా చేసే దానికి ప్రభుత్వం చేసే పనికి పెద్ద తేడా లేదు ఎవరు చేసిన ఒకరి దగ్గర బలవంతం గ గుంజతం ఇంకో చోట కర్చు పెట్టటం.
  2. కబ్జాలు (భూమి మరియు ఇతర ఆస్తులు): భూమిని కబ్జా చేయటం మాఫియా కార్యకలాపాలలో ఇంకొక టి, అసలు ప్రభుత్వానికి మించిన కబ్జకోరు ఎవరు వుండరు రాత్రికి రాత్రి భు పరిమితి చట్టం అనో ప్రాజెక్ట్ అనో రోడ్ అనో లేక మెట్రో రైలు అనో లేక సెజ్ అనో మన భూమిని మన ఇష్టంతో సంభందం లేకుండా ప్రభుత్వం ఆక్రమించుకో వచ్చు. మరి మాఫియా చేస్తే నేరం ప్రభుత్వం చేస్తే ప్రజా  ప్రయోజనార్ధం. 
  3. నకిలీ నొట్ల చెలామణి:దొంగ నోట్ల చెలామణి మాఫియా చేసే నేరాలలో ఒకటి అంటే దొంగ నోట్లు ముద్రించి  చెలామణి చెయ్యటం దీని వలన మార్కెట్లో డబ్బు సరఫరా పెరిగి ద్రవ్యోల్బణంకు దారితిస్తుంది. మరి ప్రభుత్వం దాని చేతులోని సెంట్రల్ బ్యాంకు ద్వారా  డబ్బు సరఫరా ను దాని అవసరం మీరా పెంచుతా పోతే అది కూడా ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది మరి అది తప్పు కాదా 
ఇప్పుడు మాఫియా చేసే నేరాలు కాని నేరాలని చూదాం (అంటే బాధితులు లేని నేరాలు - victimless crimes) 

  1. స్మగ్లింగ్: ప్రభుత్వం నిషేధించిన లేక ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీ కలిగిన వస్తువులని  దొంగచాటుగా మన దేశం లోకి తేవటమే స్మగ్లింగ్. దీనిలో బాధితులు లేరు చెప్పాలంటే ప్రభుత్వం నిషేధించటం వల్లే బాధితులు వుంటారు తప్ప స్మగ్లింగ్ వల్ల బాధితులు వుండరు. బాధితులు లేని నీరాన్ని అరికట్టదనింకి ప్రభుత్వం కోట్లు కర్చు చేస్తున్నది.అసలు మాఫియా చరిత్త్ర లోకి వెళ్ళితే అసలు అమెరికాలో మాఫియా పుట్టిందే 1920 లో మద్య నిషేధం వాళ్ళ దానిని స్మగ్లింగ్ చెయ్యటానికి పుట్టిందే మాఫియా.
  2. మాదకద్రవ్యాల సరఫరా: కొన్ని రకాల మత్తు పదార్దాలు మంచివి కావు అని ప్రభుత్వం నిర్ణయించి వాటిని నిషేధించటం వలన ఐనను ప్రజల నుంచి డిమాండ్ వుండటం వలన వారి అవసరం మాఫియా తీరుస్తునది.  ఈ మాదకద్రవ్యాలు వాడే వారు నేర ప్రవుర్తి కలవారిగా మారతారని చెబుతారు అసలు విషయానికి వస్తే ప్రభుత్వం నిషేధించటం వలన దాని ధర 100 రేట్లు పెరిగి వాటిని సంపాదించటం కోసం నేరాలు చేస్తున్నారు కాని మాదకద్రవ్యాల వలన నేరాలు జరగట్లేదు. నిషేధం లేకపోతే heroin అలవాటుకు అమెరికాలో సంవత్సరానికి రూ. 15000 వరకు కర్చు అవుతుంది కానీ  నిషేధం వలన ఇప్పుడు 16 నుంచి 20 లక్షలు అవుతునై ఇంత డబ్బు కావాలంటే దొంగ తనలకి వివిధ నేరాలకి పాల్పడాల్సి వస్తుంది. అమెరికా జైల్లో 50% మందికి పైగా మాదకద్రవ్యాలకు సంభందించిన నేరస్తులే అంటే ప్రభుత్వం ఎంత డబ్బు ని వృధా చేస్తోదో అర్థం చేసుకో వచ్చు. 
  3. వ్యభిచార గృహాలు : దీనివల్ల బాధితులు వుండరు .....స్వచంద వ్యాపారం మాత్రమే.....ప్రభుత్వం నిషేధం వలన మాఫియా చేతిలోకి వెళ్ళింది.
  4. బెట్టింగ్ మరియు జూదం: కొన్ని రకాలైన జుఉడాలని ప్రభుత్వం అనుమతించి (గుర్రపు పందాలు) కొన్నిటిని తనే నిర్వహిస్తూ (lottery tickets) కొన్నిటిని మాత్రం నిషేదించటం ప్రభుత్వానికే చెల్లింది. ఇందులోనూ స్వచండ వ్యాపారమే తప్ప బాధితులు లేరు ప్రభుత్వ నిషేధం వలమఫియా చేతిలోకి వెళ్ళింది. 
మాఫియాని అంతమొందించాలంటే ప్రభుత్వం తన పరిధిని తగ్గించుకోవాలి లేనిచో ఎంత అనగాదోక్కిన నిషేదాలు ఉవునంత కాలం మాఫియా వుంటుంది.
పైన పేర్కొన్న మొదటి నేరాలు అరికట్టవలిసినవే కాని ప్రభువ్త్వమే ఆ నేరాలు పాల్పడుతుంది. తప్పు ఎవరు చేసినా తప్పే ప్రభుత్వమైనా ప్రైవేటు  వ్యక్తులు ఐనా...ఆపవలసిందే
కింద పేర్కొన్న నేరాలు ప్రభుత్వ నిషేధం లేకపోతే మాఫియా అవసరమే వుండదు.....

గమనిక: ఇది పలనా దేశానికో లేక ప్రాంతానికో లేక పార్టీ కో మాత్రమె పరిమితం కాదు. అలానే నీతికి అవినీతికి కూడా సంభందం లేదు. మాఫియా చేస్తున్నది  నేరం అయితే మరి ప్రభుత్వం అదే పనిచేస్తే లేక కారణం అయితే మరి దానిని ఏమంటారో అని తెలుసుకొనే ప్రయత్నం.