Monday 7 May 2012

ప్రభుత్వం మాఫియా......ఒక విశ్లేషణ ...


మాఫియా చేసే అసలు నేరాలు  
  1. బలవంతపు వసూలు (హఫ్త):   మాఫియా చేసే ముక్య కార్యకలాపాలలో ఇది ఒకటి, అంటే జనాలని బెదిరించి డబ్బులు గుంజటం. ఇది నేరం అయితే ప్రభుత్వానికి మించి ఎవరు బలవంతపు వసూళ్ళకు పాలుపడరు కాకపోతే దానిని వారూ tax అంటారు.సరిగ్గా గమనిస్తే మాఫియా చేసే దానికి ప్రభుత్వం చేసే పనికి పెద్ద తేడా లేదు ఎవరు చేసిన ఒకరి దగ్గర బలవంతం గ గుంజతం ఇంకో చోట కర్చు పెట్టటం.
  2. కబ్జాలు (భూమి మరియు ఇతర ఆస్తులు): భూమిని కబ్జా చేయటం మాఫియా కార్యకలాపాలలో ఇంకొక టి, అసలు ప్రభుత్వానికి మించిన కబ్జకోరు ఎవరు వుండరు రాత్రికి రాత్రి భు పరిమితి చట్టం అనో ప్రాజెక్ట్ అనో రోడ్ అనో లేక మెట్రో రైలు అనో లేక సెజ్ అనో మన భూమిని మన ఇష్టంతో సంభందం లేకుండా ప్రభుత్వం ఆక్రమించుకో వచ్చు. మరి మాఫియా చేస్తే నేరం ప్రభుత్వం చేస్తే ప్రజా  ప్రయోజనార్ధం. 
  3. నకిలీ నొట్ల చెలామణి:దొంగ నోట్ల చెలామణి మాఫియా చేసే నేరాలలో ఒకటి అంటే దొంగ నోట్లు ముద్రించి  చెలామణి చెయ్యటం దీని వలన మార్కెట్లో డబ్బు సరఫరా పెరిగి ద్రవ్యోల్బణంకు దారితిస్తుంది. మరి ప్రభుత్వం దాని చేతులోని సెంట్రల్ బ్యాంకు ద్వారా  డబ్బు సరఫరా ను దాని అవసరం మీరా పెంచుతా పోతే అది కూడా ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది మరి అది తప్పు కాదా 
ఇప్పుడు మాఫియా చేసే నేరాలు కాని నేరాలని చూదాం (అంటే బాధితులు లేని నేరాలు - victimless crimes) 

  1. స్మగ్లింగ్: ప్రభుత్వం నిషేధించిన లేక ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీ కలిగిన వస్తువులని  దొంగచాటుగా మన దేశం లోకి తేవటమే స్మగ్లింగ్. దీనిలో బాధితులు లేరు చెప్పాలంటే ప్రభుత్వం నిషేధించటం వల్లే బాధితులు వుంటారు తప్ప స్మగ్లింగ్ వల్ల బాధితులు వుండరు. బాధితులు లేని నీరాన్ని అరికట్టదనింకి ప్రభుత్వం కోట్లు కర్చు చేస్తున్నది.అసలు మాఫియా చరిత్త్ర లోకి వెళ్ళితే అసలు అమెరికాలో మాఫియా పుట్టిందే 1920 లో మద్య నిషేధం వాళ్ళ దానిని స్మగ్లింగ్ చెయ్యటానికి పుట్టిందే మాఫియా.
  2. మాదకద్రవ్యాల సరఫరా: కొన్ని రకాల మత్తు పదార్దాలు మంచివి కావు అని ప్రభుత్వం నిర్ణయించి వాటిని నిషేధించటం వలన ఐనను ప్రజల నుంచి డిమాండ్ వుండటం వలన వారి అవసరం మాఫియా తీరుస్తునది.  ఈ మాదకద్రవ్యాలు వాడే వారు నేర ప్రవుర్తి కలవారిగా మారతారని చెబుతారు అసలు విషయానికి వస్తే ప్రభుత్వం నిషేధించటం వలన దాని ధర 100 రేట్లు పెరిగి వాటిని సంపాదించటం కోసం నేరాలు చేస్తున్నారు కాని మాదకద్రవ్యాల వలన నేరాలు జరగట్లేదు. నిషేధం లేకపోతే heroin అలవాటుకు అమెరికాలో సంవత్సరానికి రూ. 15000 వరకు కర్చు అవుతుంది కానీ  నిషేధం వలన ఇప్పుడు 16 నుంచి 20 లక్షలు అవుతునై ఇంత డబ్బు కావాలంటే దొంగ తనలకి వివిధ నేరాలకి పాల్పడాల్సి వస్తుంది. అమెరికా జైల్లో 50% మందికి పైగా మాదకద్రవ్యాలకు సంభందించిన నేరస్తులే అంటే ప్రభుత్వం ఎంత డబ్బు ని వృధా చేస్తోదో అర్థం చేసుకో వచ్చు. 
  3. వ్యభిచార గృహాలు : దీనివల్ల బాధితులు వుండరు .....స్వచంద వ్యాపారం మాత్రమే.....ప్రభుత్వం నిషేధం వలన మాఫియా చేతిలోకి వెళ్ళింది.
  4. బెట్టింగ్ మరియు జూదం: కొన్ని రకాలైన జుఉడాలని ప్రభుత్వం అనుమతించి (గుర్రపు పందాలు) కొన్నిటిని తనే నిర్వహిస్తూ (lottery tickets) కొన్నిటిని మాత్రం నిషేదించటం ప్రభుత్వానికే చెల్లింది. ఇందులోనూ స్వచండ వ్యాపారమే తప్ప బాధితులు లేరు ప్రభుత్వ నిషేధం వలమఫియా చేతిలోకి వెళ్ళింది. 
మాఫియాని అంతమొందించాలంటే ప్రభుత్వం తన పరిధిని తగ్గించుకోవాలి లేనిచో ఎంత అనగాదోక్కిన నిషేదాలు ఉవునంత కాలం మాఫియా వుంటుంది.
పైన పేర్కొన్న మొదటి నేరాలు అరికట్టవలిసినవే కాని ప్రభువ్త్వమే ఆ నేరాలు పాల్పడుతుంది. తప్పు ఎవరు చేసినా తప్పే ప్రభుత్వమైనా ప్రైవేటు  వ్యక్తులు ఐనా...ఆపవలసిందే
కింద పేర్కొన్న నేరాలు ప్రభుత్వ నిషేధం లేకపోతే మాఫియా అవసరమే వుండదు.....

గమనిక: ఇది పలనా దేశానికో లేక ప్రాంతానికో లేక పార్టీ కో మాత్రమె పరిమితం కాదు. అలానే నీతికి అవినీతికి కూడా సంభందం లేదు. మాఫియా చేస్తున్నది  నేరం అయితే మరి ప్రభుత్వం అదే పనిచేస్తే లేక కారణం అయితే మరి దానిని ఏమంటారో అని తెలుసుకొనే ప్రయత్నం.
  

6 comments:

  1. మీ బ్లాగులో రెండవ భాగంతో ఏకీభవిస్తాను.స్వయమ్నిగ్రహమే మంచిది, కాని moral police వలన లాభం లేదు.కాని మొదటి భాగంతో ఏకీభవించలేను.కొన్ని రకాల పన్నులైనా అవసరమేకదా.అలాగే ఒకోసారి ప్రజాప్రయోజనాలకోసం ( రైలు,రోడ్డు మార్గాలు వెయ్యడం వంటివి )ప్రైవేటు స్థలాల్ని ,భూముల్ని తీసుకోవలసిన అవసరం ఉంటుంది. ఐతే అన్యాయంగా ,పరిహారం చెల్లించకుండా చేస్తే కోర్టుల ద్వారా న్యాయం పొందే హక్కు,అవకాశం పౌరులకు ఉండాలి.

    ReplyDelete
    Replies
    1. రెండవ భాగంతో ఏకీభవిన్చినందుకు ధన్యవాదాలు. ఇక మొదటి భాగానికి వస్తే.....ప్రభుత్వం పన్నుల డబ్బు తో చేసే ఏ పని అయినా private సంస్థలు చెయ్యగలవు......రోడ్లు అయినా రైలు అయినా..... మాఫియా కూడా బలవంతపు వాసులని చక్కగా protection money అనే అంటుంది. భుసేకరణ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు ప్రాజెక్ట్లు కావాలంటే private వ్యక్తులే మార్కెట్ లో వున్న ధర కు కొంటారు. ప్రభుత్వ జోక్యం అనవసరం.

      Delete
  2. ప్రయివేటు సంస్థల చేత చేయించినా కొన్నిపనుల బాధ్యతలు ప్రభుత్వానివే.దానికోసం పన్నులు అవసరం.ప్రతికాలంలోను,ప్రతిదేశంలోను ఏదో రకం ప్రభుత్వలు ఉన్నైకదా?దేశరక్షణ,శాంతిభద్రతల నిర్వహణకోసమైనా ప్రభుత్వం ఉండాలి.

    ReplyDelete
    Replies
    1. అసలు ప్రభుత్వం అవసరమా అనే విషయం మీద త్వరలో ఇంకో పోస్ట్ వేస్తా.....
      సరే కొన్ని పనులకి ప్రభుత్వం కావాలి అనుకొన్న ప్రభుత్వ పరిధి చాల చిన్నగా వుండాలి దానికి కర్చు voluntary tax . లోనో లేక దాని సేవలకు బిల్లు రూపం లోనో ప్రజల వద్ద నుంచి పొంద వచ్చు.

      Delete
  3. మీ అభిప్రాయాలు extream rightగా ఉన్నాయి.
    I
    1. ప్రభుత్వాలు వసూలుచేసే పన్ను (పోనీ హఫ్తా) తిరిగి ప్రజలకోసం ఖర్చుచెయ్యాలనే ఉద్దేశ్యంతో చేస్ది. మాఫియా అలాకాదుకదా? ( మన ప్రభుత్వాలు చేస్తున్నాయా అనకండి. నేను 'ప్రభుత్వం' గురించి మాట్లాడుతున్నాను, ప్రభుత్వ లక్యాల గురించి మాట్లాడుతున్నాను). ఒకవేళ ఒక మాఫియా ఇలాగే హఫ్తా వసూలు చేసి అందరినీ ఒకే rule bookతో పాలించగలిగితే, I am okay with that. రెందులేదా అంతకన్నా ఎక్కువ మాఫియాలు ఉన్నా ఫర్లేదు కానీ రెండు rule books and that to incompatible ఉండరాదు. As long as those organizations regard that rule book above their ego's, that should pretty much be fine. Wait... aren't the 'governments' doing the same?
    2. Agreed.
    3. గవర్నమెంటుకూ, మాఫియాకూ పోలికలు తెచ్చారుకాబట్టి, ఒకమాఫియా ఇంకొక మాఫియా currencyని imitateచెయ్యడం తప్పే. హా... కావాలంటే ఒక మాఫియా ఆ రెండోదానికి parallelగా ఇంకో currencyని అమలులోకి తేవడానికి ప్రయత్నించవచ్చు. మనం కొన్ని సార్లు డబ్బుతో అవసరంలేకుండానే transactions చేస్తాం. 'ప్రభుత్వాలు' దానికి అడ్డుచెప్పడంలేదుకదా!

    II
    1. ఇదికూడా పన్నుల్లంటిదే. తన ఆధీనంలోనేను ప్రాంతాల నుండి, తన ఆధీనంలోని ప్రాంతాలకి వచ్చిపడే (ప్రభుత్వాల విషయంలో ప్రాంతాలను దేశాలు అని చదువుకోగలరు) వస్తువులపై పన్ను విధించి ఆవచ్చిన డబ్బును తన ఆధీనంలోని ప్రాంతాల ప్రజల బాగోగులకోసం ఖర్చుపెట్టడం ఇక్కడ concept. ఒక మాఫియాకి తన ఆధీనంలో ఉన్న ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది (హఫ్తాలు వసూలు చేస్తున్నారు కాబట్టి). ఆబాధ్యతను సీరియస్‌గా తీసుకొనే ఏమాఫియాకైనా (ప్రభుత్వానికైనా) ఇలా customs వసూలు చేయక తప్పదు. దీనికున్న ఒకేఒక solution ఆరెండు ప్రాంతాలనీ, ఒకే మాఫియా అధికారం క్రిందకి తేవడమే (అంటే దేశాలు కనీసం వాణిజ్య పరంగా విలీనమవ్వడంలాంటిదన్నమాట).
    2. ప్రభుత్వాల ప్రధాన బాధ్యత ప్రజలను రక్షించడం. మిగతావన్నీ తరువాత. ఆరకంగా చూస్తే ప్రజల ఆరోగ్యాన్ని నాశనంచేసే మాదక ద్రవ్యాలను నిషేధించక తప్పదు. ఆమాటకొస్తే drug mafiaల్లోకూడా drugsని అమ్మేవారు (the only people mafia cares about -for different reasons though) వాటిని సేవించకూడదనే నిబంధనలు ఉంటాయి(ట). అలా దొంగతనంగా ఎవరినా సొంతడబ్బుతో కొనుక్కునైనా సేవించినట్లు తెలిస్తే, శిక్షలూ కథినంగానే ఉంటాయట (courtesy : Freakonomics).
    3. ఇదీ పైదానిలాగే. ప్రజలకి కొన్ని అలవాట్లు హానికారకం అన్నభావనతోనే ప్రభుత్వాలు ఈపనిచేస్తాయి. Drugsలాగా ఇందులో compulsive addiction ఉండదుకాబట్టి, ప్రభుత్వాలు పూర్తిగా నిషేధించకుండా కొన్ని జాగ్రత్తలతో దీన్ని కొనసాగనివ్వవచ్చునేమో. But then అందులో తమ ఇష్టంలెకుండానే, తప్పనిసరై కూరుకుపోయెవారి సంగతేమిటి? వ్యభిచారం 'సమస్య'కైతే ప్రభుత్వాల ఉపాధి కలపనే సరైన పరిష్కారం. అది ఏప్రభుత్వమైనా చేయగలిగినప్పుదు, కేవలం ఉపాధికోసమని వేరే గత్యంతరంలేక వ్యభిచార వృత్తిని ఆశ్రయించవలసిన అవసరంలేకుండా చేయగలిగినప్పుదు ప్రభుత్వాలు దీన్ని నిషేధించాల్సిన అవసరంలేదు. విలాసాలకోసం ఎవరైనా ఈ వృత్తిని ఆశ్రయిస్తె అది వారిష్టం. వారి ఖర్మ. ఉపాధి కల్పన విషయాన్ని పట్టించుకోని ప్రభుత్వాలకు ఇఛ్ఛాపూర్వక వ్యభిచారాన్ని నిషేధించే హక్కు ఉండబోదు.
    4. Same as above. ప్రభుత్వాలు లాటరీలు నిర్వహించడం ఖచ్చితంగా తప్పే. లాటరీల వెంట పరుగులు పెడితే ఉన్నదికూడా పోతుందన్న తెలివిడి ప్రజలకు కల్పించాలి, తన ప్రజల శ్రేయస్సుకోసమై నిషేధించాలికూడా.

    ReplyDelete
  4. మొదటగా I want to say that I am inclined towards libertarian ideology.

    ఇప్పుడు మీరిచ్చిన అభిప్రాయాలను చూదాం

    //1. ప్రభుత్వాలు వసూలుచేసే పన్ను (పోనీ హఫ్తా) తిరిగి ప్రజలకోసం ఖర్చుచెయ్యాలనే ఉద్దేశ్యంతో చేస్ది. మాఫియా అలాకాదుకదా? ( మన ప్రభుత్వాలు చేస్తున్నాయా అనకండి. నేను 'ప్రభుత్వం' గురించి మాట్లాడుతున్నాను, ప్రభుత్వ లక్యాల గురించి మాట్లాడుతున్నాను). ఒకవేళ ఒక మాఫియా ఇలాగే హఫ్తా వసూలు చేసి అందరినీ ఒకే rule bookతో పాలించగలిగితే, I am okay with that. రెందులేదా అంతకన్నా ఎక్కువ మాఫియాలు ఉన్నా ఫర్లేదు కానీ రెండు rule books and that to incompatible ఉండరాదు. As long as those organizations regard that rule book above their ego's, that should pretty much be fine. Wait... aren't the 'governments' doing the same?//



    నా సమస్య వాళ్ళు rule book లేక రాజ్యాంగం ప్రకారం పాలించార లేదా అని కాదు. అసలు ఒకళ్ళ దగ్గిర బలవంతం గ వస్సులు చెయ్యటం తప్ప కాదా అని మాత్రమే.

    అసలు ఆ వస్సులతో వచ్చిన డబ్బు తో చేసే కర్చు వళ్ళ ప్రజలకి ఉపయోగమా లేదా అనేది వేరే చర్చ నా సమస్య అల్ల అసలు ఆ వస్సూల్లు తప్ప కాదా అని మాత్రమే.



    //3. గవర్నమెంటుకూ, మాఫియాకూ పోలికలు తెచ్చారుకాబట్టి, ఒకమాఫియా ఇంకొక మాఫియా currencyని imitateచెయ్యడం తప్పే. హా... కావాలంటే ఒక మాఫియా ఆ రెండోదానికి parallelగా ఇంకో currencyని అమలులోకి తేవడానికి ప్రయత్నించవచ్చు. మనం కొన్ని సార్లు డబ్బుతో అవసరంలేకుండానే transactions చేస్తాం. 'ప్రభుత్వాలు' దానికి అడ్డుచెప్పడంలేదుకదా! //

    మనం వాడె currency ని ప్రభుత్వాలు ఎలా మున్ద్రించాలని decide చేస్తాయి

    ఒకప్పుడు ప్రతి ప్రభుత్వమూ వాటి currency ని ముద్రిచాలి అంటే బంగారం లేదా వెండి నిల్వలను బట్టి ముద్రించేవి ఇంత వరకు its fair. But ఎప్పుడు ఐతే వాటి అవసరార్ధం ముద్రించటం మొదలు పెట్టినియ్యో వాటి వెనుకల (gold or any backup) ఏమి లేకుండా అవి దొంగ నోట్ల కింద లెక్క.



    //II
    1. ఇదికూడా పన్నుల్లంటిదే. తన ఆధీనంలోనేను ప్రాంతాల నుండి, తన ఆధీనంలోని ప్రాంతాలకి వచ్చిపడే (ప్రభుత్వాల విషయంలో ప్రాంతాలను దేశాలు అని చదువుకోగలరు) వస్తువులపై పన్ను విధించి ఆవచ్చిన డబ్బును తన ఆధీనంలోని ప్రాంతాల ప్రజల బాగోగులకోసం ఖర్చుపెట్టడం ఇక్కడ concept. ఒక మాఫియాకి తన ఆధీనంలో ఉన్న ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది (హఫ్తాలు వసూలు చేస్తున్నారు కాబట్టి). ఆబాధ్యతను సీరియస్‌గా తీసుకొనే ఏమాఫియాకైనా (ప్రభుత్వానికైనా) ఇలా customs వసూలు చేయక తప్పదు. దీనికున్న ఒకేఒక solution ఆరెండు ప్రాంతాలనీ, ఒకే మాఫియా అధికారం క్రిందకి తేవడమే (అంటే దేశాలు కనీసం వాణిజ్య పరంగా విలీనమవ్వడంలాంటిదన్నమాట).//



    ఇక్కడ కూడా సమస్య అదే అసలు పన్ను ఎలా వేస్తారు

    సరే 1991 కి ముందు correct ఐన పన్నులు(customs or restrictions on imports) 1991 తర్వాత చాల వరుకు ఎతివేసారు అంటే ప్రజల కు అవి హాని చేస్తునయ్యి అని ఒప్పుకునట్టే కదా......అసలు ఈ నిభందనలే లేక పోతే అసలు mafia నే వుండదు కదా ఇప్పుడు గోల్డ్ స్ముగ్గ్లింగ్ మాఫియా ఎందుకు చేయటం ల....ఎందుకంటే దాని వాళ్ళ లాభం లేదు కాబట్టి.

    //2. ప్రభుత్వాల ప్రధాన బాధ్యత ప్రజలను రక్షించడం. మిగతావన్నీ తరువాత. ఆరకంగా చూస్తే ప్రజల ఆరోగ్యాన్ని నాశనంచేసే మాదక ద్రవ్యాలను నిషేధించక తప్పదు. ఆమాటకొస్తే drug mafiaల్లోకూడా drugsని అమ్మేవారు (the only people mafia cares about -for different reasons though) వాటిని సేవించకూడదనే నిబంధనలు ఉంటాయి(ట). అలా దొంగతనంగా ఎవరినా సొంతడబ్బుతో కొనుక్కునైనా సేవించినట్లు తెలిస్తే, శిక్షలూ కథినంగానే ఉంటాయట (courtesy : Freakonomics).//



    అవును అసలు ప్రభుత్వ ప్రధాన బాద్యత ప్రజలను వారి ఆస్తులను రక్షించటం 100% true. కాని మాదకద్రవ్యాల వ్యాపారం లో victim లేరే. ఇది స్వచంద వ్యాపారం. మన దేశం లో మందు కన్నా మనం తినే నూనె ఆహారం వాళ్ళ ఎక్కువ జనం చాచిపోతునారని ఒక అంచనా అందుకని మనం దాని నిషేదిధామ

    "If a man drinks wine and not water I cannot say he is acting irrationally. At most I can say that in his place I would not do so. But his pursuit of happiness is his own business, not mine." - Ludwig Von Mises

    ReplyDelete